yoga for pregnant women || yoga asanas in telugu

yoga for pregnant ladies for normal delivery
Spread the love

yoga for pregnant women:

yoga for pregnant women : గర్భధారణ సమయములో చాలా మంది యోగ గురించి తెలుసుకోవాలనుకుంటారు.అసలు గర్భధారణ సమయములో యోగ చేయడం సురక్షితమేనా.? అనే సందేహం కలుగుతుంది. కాబట్టి యోగ గురించి తెలుసుకోవడం ఎంతో మేలు.కానీ కొంతమంది రెస్ట్ కోసం ఒకదగ్గరే కూర్చుంటూ ఉంటారు.గర్భిణీలకు హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయి.అలాంటి సమస్యలు రాకుండా మీరు యోగ ఆసనాలు చేయడం ద్వారా ఎంతో మానసిక ఉల్లాసం,ఆనందం మరియు అందం కూడా మీ సొంతం.కావున యోగ చేయడంలో ఉల్లాసంతో పాటు మీ బిడ్డ పెరుగుదల చాలా బాగుంటుంది,మరియు ఆరోగ్యంగా ఉంటారు. మిగతా పిల్లలతో పోలిస్తే మీ బిడ్డ ఆరోగ్యం రెట్టింపుగా ఉంటుంది.తల్లి బిడ్డ ఆరోగ్యంతో పాటు ఎంతో ఉల్లాసంగా ఉంటారనే విషయం శాస్రియంగా నిరూపితమైంది. కావున ఎలాంటి ఆసనాలు చేయాలి అనేది తెలుసుకుందాం.

గర్బధారణ సమయములో సురక్షితమైన యోగా ఆసనాలు:

1.తడసానా – పర్వత భంగిమ

(Tadasana – Mountain Pose):

tadasana-yoga for pregnant ladies near me

గర్భిణీలకు తడసానా “యోగ ” వల్ల చాలా ప్రయోజనం ఉంది.గర్భిణీలకు వెన్నుముకని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.మీకు నడుము నొప్పి సమస్యలని దూరం చేస్తుంది.నడుము నొప్పిని తగ్గిస్తుంది.

చేసే విధానము :

 • మీరు ముందుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంనంలో ఒక స్థలంమును ఎంచుకోండి.మీరు యోగ చేసే విధానం లో స్పష్టంగా తెలుసుకొని జాగ్రత్తగా చేయండి.
 • యోగ మొదలు పెట్టేటప్పుడు ముందుగా నిటారుగా కాళ్ళ పైన మొత్తం నిలబడేలా ఉండండి.
 • ఆలా నిలబడిన తరవాత చేతులను ముందుకు చాచి మెల్లగా చేతులను నమస్కారంతో తల పైకి లేపండి.
 • ఆ తరువాత మెల్లగా చేతులని వెనక్కి పంపిస్తూ విన్నుముకని సాగదీయండి.కానీ మీ వీపుపై ఒత్తిడి పడేలా చేయకండి.
 • ఇప్పుడు మీ చేతులను మెల్లగా వెనక్కి పంపిస్తూ మీ కాళ్ళను బ్రోటినవ్రేలు పైన ఉంచండి. లోతుగా ఊపిరి పీల్చుకొని ఒక 10 అంకెలు మనసులో లెక్కపెట్టుకుంటూ 10 అంకెలు అయిపోయే వరకు అలాగే ఉంచి.10 అంకెలు అయిపోయాక మెల్లగా శ్వాసను తీసుకోండి.ఆ తరువాత యధాస్థితికి మెల్లగా వచ్చి కూర్చోండి.
 • మీ తొడలపై అరచేతిలను ఉంచి విశ్రాంతి తీసుకోండి. ఈ తడసానా వలన నడుమునొప్పి తగ్గుతుంది ..చాలా ఉత్సహంగా ఉంటుంది.

2. వీరభద్రసనం(Virbhadrasana – Warrior Pose) :

yoga asanas telugu

వీరభద్రసనం మీ శరీరమంతా పనిచేస్తుంది.ఇది మీ వెనుక, ఛాతీ మరియు తుంటి కండరాలను పనిచేస్తుంది. మీ దిగువ శరీరాన్ని కూడా బలోపేతం చేయడానికి ఇది గొప్ప భంగిమ.

చేసే విధానము :

 • మీరు ముందుగా నిటారుగా నిలబడండి.
 • మీ చేతులను ముందుకు చాపండి. చేతులను కలపండి.
 • ఇప్పుడు, మీ అడుగులను వెడల్పును వేరుగా విస్తరించండి.
 • మీ ఎడమ పాదాన్ని నేలమీద గట్టిగా ఉంచి, మీ శరీరాన్ని పూర్తిగా కుడి వైపుకు తిప్పండి.
 • మీ కుడి మోకాలికి వంచండి.
 • నెమ్మదిగా, లోపలి ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా మీ చేతులను మీ తలపైకి ఎత్తండి,మీ వెనుకభాగానికి, వెనుకకు సాగండి.
 • సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు 10 నుండి 15 వరకు భంగిమను పట్టుకోండి. (10 నుండి 15 నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి)
 • ఇప్పుడు మీ చేతులను క్రిందికి తీసుకువచ్చేటప్పుడు నెమ్మదిగా ఊపిరి పిల్చుకోండి.
 • మీ మోకాలిని నిఠారుగా ఉంచండి.
 • నెమ్మదిగా మీ పాదాలను తిరిగి కలపండి.
 • అదే మాదిరిగా మీ దశలను మరొక వైపు పునరావృతం చేయండి

3. త్రికోణసనా – త్రిభుజం భంగిమ:

(Trikonasana – Triangle Pose):

trikonasana-yoga asanas in telugu pdf

 

గర్భధారణ సమయములో మీకు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలని దూరం చేస్తుంది.గర్భధారణ సంబంధిత జీర్ణ రుగ్మతలను తగ్గించడానికి మంచి మార్గం ఈ త్రిభుజా భంగిమ.

చేసే విధానము :

 • మీరు ముందుగా నిటారుగా నిలబడండి.
 • నెమ్మదిగా మీ కాళ్ళను విస్తరించండి.మీ రెండు కాళ్ళ కాలి వేళ్ళు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా చూసుకోండి
 • సమానంగా మీ అరచేతులని ముందుకు చాపండి.
 • మీరు శ్వాస తీసుకుంటూ ఎడమవైపు కి మీ భుజాన్ని వంచండి. అదే సమయములో మీ కుడి చేతిని పైకి ఎత్తండి.
 • మీ తలని ఎడమ వైపుకు వంచి, కుడి చేతి వేలను చూస్తూ ఉండండి.
 • సుమారు 10 నుండి 20 సెకన్ల పాటు ఉంచండి.
 • సాధారణంగా అలాగే శ్వాసను కొనసాగించండి.ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి మరియు ప్రారంభ భంగిమకు తిరిగి రావడానికి మీ శరీరాన్ని పైకి ఎత్తండి.
 • మీ కుడి వైపున దశలను పునరావృతం చేయండి.

4. ఉత్తనాసనం – స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్:

(Uttanasana – Standing Forward Bend) :

uttanasana - yoga asnas in telugu pdf free download

గర్భధారణ సమయములో మీ కాళ్లు మరియు వెనుకభాగం ఎక్కువగా బాధిస్తూ ఉంటె. ఈ ఆసనం తో మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కావున ఉత్ససనాన్ని చేయడానికి ప్రయత్నించండి.

చేసే విధానము :

 • 3 అంగుళాల దూరంలో కాళ్ళని ఉంచుతూ నిటారుగా నిలబడండి.
 • ఊపిరి  పీల్చుకుంటూ మెల్లగా మీ చేతులను మీ తలపైకి ఎత్తి,చేతులను వెనుక వైపు మీ చేతులను దగ్గరికి కలపండి.
 • ఊపిరి పీల్చుకునేటప్పుడు, ముందుకు వంగండి.అదే సమయంలో, చేతులు కలుపుతూ ముడుచుకోండి.
 • 10 నుండి 15 వరకు నెమ్మదిగా లెక్కించడానికి భంగిమను పట్టుకొని అలాగే శ్వాసను కొనసాగించండి.
 • ఊపిరి లోపలి పీల్చుకుంటూ శ్వాస తీసుకుంటూ మెల్లగా మీ శరీరాన్ని ప్రారంభదశకి తీసుకురండి.

గమనిక :  ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి కానీ.సమయాన్ని బట్టి చేయండి కానీ ఊపిరిని అదే పనిగా బిగపట్టకండి.ఆలా చేస్తే ప్రాణానికే ప్రమాదం. జాగ్రత్తగా చేస్తూ తెలుసుకుంటూ చేయండి.

5. మార్జారియసనా / బిటిలాసన – పిల్లి భంగిమ / ఆవు భంగిమ:

(Marjariasana/Bitilasana – Cat Pose/Cow

Pose):

marjariasana-yoga for pregnant women

ఈ ఆసనం 26 వారాల తరువాత చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ భంగిమ మీ రక్త ప్రసరణ స్థాయిని మెరుగుపరుస్తుంది. ఇది మీ మణికట్టు మరియు భుజాలను కూడా బలపరుస్తుంది.

చేసే విధానము :

 1. ముందుకు వంగుతూ ముందు చేతులను , మోకాళ్ళను కింద భూమికి టచ్ అయ్యేలా ఉంచాలి.
 2. ఆ తరువాత మీ తలని నిటారుగా ఉంచండి.
 3. మీరు ఉపిరిపీల్చుకుంటూ ,మీ యొక్క తలని పైకి ఎత్తండి. అదే సమయములో మెల్లగా మీ తలని కొద్దిగా వెనక్కి వంచండి.
 4. తలని వెనక్కి వంచడం ద్వారా మీ వెన్నుముక కిందికి ఉండేలా చూసుకోండి. ఆలా 10 సెకన్లు ఊపిరి పీల్చుకుంటూ ఈ ఆసనం చేయండి.
 5. మెల్లగ యధాస్థితికి మీ శరీరాన్ని తీసుకురండి.

గమనిక :  పూర్తిగా అర్థమయ్యాకే ఈ ఆసనాలు చేయండి.

మీకు తెలియజేయడానికి మేము మీకు అర్ధమయ్యేలా ప్రయత్నించామని అనుకుంటున్నాము.ఒకవేళ ఇంకా మీకు కంటెంట్ రూపంలో కావాలి అనుకునే వారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.ఎలాంటి సందేహాలు అయినా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.మీకోసం మీ సందేహాల్ని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ధన్యవాదములు

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *