Top 5 Parenting Tips in telugu

Top 5 Parenting Tips in telugu
Top 5 Parenting Tips in telugu :
- ఉదాహరణలు వాడండి
- సానుకూల వైఖరి
- మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడుతూనే ఉండాలి
- పిల్లలు మిమ్మల్నే అనుకరిస్తారు
- వారి ఇష్టాలు వారివే
1.ఉదాహరణలు వాడండి
పిల్లల మెదడు ఒక ఖాళీ పాత్ర లాంటిది, మనం చెప్పిన విషయం వాళ్ళకి అర్ధం అయ్యేంత శక్తి వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళకి విషయం చెప్పేటప్పుడు ఉదాహరణ తో చెప్పాలి .
అలా అని మన పక్కింటి కుర్రాడి తో పోల్చడం మంచిది కాదు, ఏమో తనని తక్కువ చేయడం తనకు నచ్చక పోవడమే కాగా కొద్దిరోజులకు మీరు చెప్పే విషయాలను పెడచెవిన పెట్టె అవకాశం లేకపోలేదు.
కాబట్టి గొప్ప గొప్ప వ్యక్తులతో పోల్చండి , ఉదహరణ కు “చిన్నప్పుడు అబ్దుల్ కలామ్ గారు నీలాగే ఉండే వారు. నువ్వు కూడా ఆయనా లాగే గొప్పవాడివి అవుతావు” ఇలా మీ పిల్లల్ని మీరే గొప్పవాళ్లుగా తీర్చి దిద్దండి .
2.సానుకూల వైఖరి
మీ పిల్లలు మీతో సరిగా ఉండకపోతే అది మీ తప్పే. ఎందుకంటే వాళ్ళు మీతో అన్ని షేర్ చేసుకునే వాతావరణం మీ దగ్గర వాళ్ళకి దొరకడం లేదు.
అందుకే పిల్లలు ఏదైనా విషయం చెప్పినప్పుడు సానుకూలం గా వ్యవహరించండి.
చెప్పిన విషయాన్ని ముందే తప్పు అనకుండా విని ఇది కరెక్టే అని ఒప్పుకొని నెమ్మదిగా ఆ విషయం లోని తప్పులని పిల్లలకు అర్ధం అయ్యేలా చూపండి.
3.మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడుతూనే ఉండాలి
ఎప్పుడూ మనం ఉన్నది పోటీ ప్రపంచం ఎప్పుడు పరుగెడితే డబ్బు సంపాదించలేం, కానీ మీరు పిల్లలకి సమయాన్ని ఇవ్వకపోతే వాళ్ళను మీరు అర్ధం చేసుకోలేరు అలాగే వాళ్ళు మిమ్మల్ని అర్ధం చేసుకోలేరు.
కాబట్టి పిల్లల కోసం కొంత సమయం పెట్టుకొని వాళ్ళ తో మాట్లాడాలి వాళ్లకు తెలియకుండానే మీకు అన్ని చెప్తు ఉండాలి.
ఉదాహరణ : “స్కూల్ లో ఏమైనా గొడవలు పడుతున్న,స్కూల్ నచ్చక పోయిన,ఎవరైనా టీచర్ అస్తమానం కొడుతున్న” ఇలా మీకు చెప్పారు అంటే మీరు వాటిని సరిదిద్దె అవకాశం ఉంది.
అలా మీరు చేయకపోతే పిల్లలు షేర్ చేసుకోవడానికి ఎవ్వరు లేక లోపలే కుమిలి మాట వినని లేదా సైకో గా మారే అవకాశం లేకపోలేదు.
అందుకే తల్లి దండ్రులు పిల్లల తో సమయం కల్పించుకొని మరి మాట్లాడుతూ ఉండాలి.
4.పిల్లలు మిమ్మల్నే అనుకరిస్తారు
ఒకరి వ్యక్తుత్వన్ని వాళ్ళ తల్లి తండ్రులను చూసి లేదా వాళ్ళ స్నేహితులని చూసి అంచనా వేయచ్చు. ఎందుకంటే పిల్లలు మాట్లాడడం నుంచి ప్రతిదీ పక్క వాళ్ళ ను చూసి నేర్చుకుంటారు.
మీరు తప్పులు చేస్తూ వాళ్ళను వొద్దు అంటే వాళ్ళు ఊరుకోరు కాబట్టి పిల్లలు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ ముందు మీరు అలాగే ఉండండి.
5.వారి ఇష్టాలు వారివే
చాలా మంది తమ కోరిలను పిల్లలపై రద్దుతారు, ఉంకొంత మంది తమ పిల్లలు ఏదవ్వలి అనుకుంటే అదే చేస్తాం అంటారు.
కానీ రెండు తప్పే మీ అబ్బాయి /అమ్మాయి పోలీస్ అవ్వాలి అనుకుంటారు కానీ మీ కుంటుంబీకులు కొంచం ఎత్తు తక్కువ గా ఉంటారు, ఇలా ఎత్తు తక్కువగా ఉంటే పోలీస్ ఎలా అవ్వగలరు.
కాబట్టి వారి ఇష్టాలు కనిక్కొని, వాటి అన్నిటి గురించి పిల్లలకు క్లుప్తం గా వివరించాలి. ప్రతి దానిలో మంచి,చెడులు లేకపోలేదు అవి వాళ్లకు అర్ధం అయ్యేలా చేస్తే అప్పుడు వారే మంచి ఆప్షన్ ని ఎంచుకుంటారు.
అలా అని చెడు మార్గం లో వెళ్తే ఒప్పుకోబోయేది లేదు సుమీ… లీగల్ కి ఇల్లీగల్ మధ్య వ్యత్యాసంన్ని క్లుప్తం గా వివరించాలి.