telugu grammer in telugu || సంధులు-వ్యాకరణ పరి భాషలు

Spread the love

telugu grammer in telugu:

telugu grammer : సంధులు – వ్యాకరణ పరి భాషలు :
తెలుగు వ్యాకరణ పద్దతిలో సంధులను ఉపయోగించే వాటి పరిభాషతో కూడిన పదాలను తెలిజేయడం జరుగుతుంది.
1. సవర్ణదీర్ఘసంధి:
అ ,ఇ ,ఉ,ఋ లకు అచ్చులు పరమైతే దీర్ఘాలతో కూడిన ఏకవచనముతో తెలియజేసే వాటిని సవర్ణదీర్ఘసంధి అని అంటారు.
ఉదాహరణ: రామ+ఆజ్ఞ = రామాజ్ఞ (సవర్ణదీర్ఘసంధి )
గురు+ఉపదేశము = గురూపదేశము (సవర్ణదీర్ఘసంధి )
2.గుణసంధి: అకారానికి ఇ ,ఉ ,ఋ లు పరమైతే ఏ ,ఓ ఆర్ లు ఏకవచనముగా తెలియజేసేది గుణసంధి.
ఉదాహరణ: సూర్య + ఉదయము =సూర్యోదయము(గుణసంధి)
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు (గుణసంధి )
3.వృద్ధి సంధి: అకారానికి ఏ,ఐ లు పరమైతే ఔకారానికి ఋ ఋ లు పరమైతే ఆర్ ఏకవచనముతో పిలువబడేది వృద్ధిసంధి అంటారు.
ఉదాహరణ: భువన + ఏక =భువనైక (వృద్ధిసంది)
పరం+ఔషధం=పరమౌషధం (వృద్ధిసంధి)
అష్ట+ఐశ్వర్యములు =అష్టైశ్వర్యములు (వృద్ధిసంధి)
4.అనునాసిక సంధి: క , చ , ట ,త , ప లకు ‘న – మ ‘ అను అనునాసికా అక్షరములు పరమైతే క్రమముగా ఆయా వర్గ అక్షరములు అనునాసికా సంధి అగును.
ఉదాహరణ: జగత్+నాటకము=జగన్నాటకము.(అనునాసికా సంధి )

5.జస్త్వ సంధి: ఆయా వర్గ ప్రథమ అక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, పరమైతే క్రమముగా ఆయా వర్గ తృతీయ అక్షరములు అగును.
ఉదాహరణ: వాక్+ఈశ=వాగీశ.(జస్త్వ సంధి)

6.శ్చుత్వ సంధి: ఆయా సకారత వర్గములకు, శకార చవర్గములు పరమైతే శకార చవర్గములు ఆదేశమగును.
ఉదాహరణ: తపస్+శక్తి=తపశ్శక్తి(శ్చుత్వ సంధి).

7.ష్టుత్వ సంధి: ష్టుత్వ సంధి అనగా, సకార తవర్గములకు “షకార- టవర్గములు” పరమైతే, ఆయా షకార-టార్గములు అందురు.
ఉదాహరణ: తత్+టీక=తట్టీక(ష్టుత్వ సంధి).

8.ఛత్వ సంధి: క – చ – ట – త – ప లకు ‘శ’ అనే వర్ణము పరమైది ‘ఛ’ కారము వచ్చును.
ఉదాహరణ: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి(ఛత్వ సంధి).

అచ్చు సంధులు:

1.అకార సంధి: అత్తునకు సంధి బహుళముగా వచ్చినచో,

ఉదాహరణ: మేన+అల్లుడు=మేనల్లుడు(అకార సంధి)

2.యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరమైతే స్వరంబునకు యడాగమంబగు.
ఉదాహరణ: వెల+ఆలు=వెలయాలు.(యడాగమ సంధి )

3.ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు వున్నచో ఇకారసంధి అగును.
ఉదాహరణ: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు(ఇకారసంధి)

4.ఉకార సంధి: ఉత్తునకు సంధి నిత్యం ఉన్నచో,
ఉదాహరణ: మనము+ఉంటిమి = మనముంటిమి.(ఉకార సంధి)
రాముడు +అతడు = రాముడతడు (ఉకార సంధి)
ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరమైతే సంధి తరచుగానగు వచ్చినచో ఆమ్రేడిత సంధి అగును.
ఉదాహరణ: ఏమి+ఏమి=ఏమేమి.(ఆమ్రేడిత సంధి)
చివర + చివర= చిట్టచివర.(ఆమ్రేడిత సంధి)
కడ + కడ = కట్టకడ(ఆమ్రేడిత సంధి)

హల్లు సంధులు :

1.గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ,స,డ,ద,వలు బహుళముగ వచ్చినచో గసడదవాదేశ సంధి అగును.
ఉదాహరణ: వాడు+కొట్టె=వాడుగొట్టె(గసడదవాదేశ సంధి)
2.సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు పరమైతే సరళములగు
ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెనుగలువలు(సరళాదేశ సంధి)

3.పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పరమైతే
పుంప్వాదేశ సంధి అగును.
ఉదాహరణ: సరసము+మాట = సరసపుమాట(పుంప్వాదేశ సంధి)
ముత్యము+చిప్ప=ముత్యపుచిప్ప(పుంప్వాదేశ సంధి)
4.ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు,చిఱు,కడు,నడు,నిడు శబ్దముల ‘ఱ-డ’ లకు అచ్చు పరమైతే ద్విరుక్త టకారంబగును.
ఉదాహరణ: నడు+ఇల్లు=నట్టిల్లు(ద్విరుక్తటకారాదేశ సంధి)
చిఱు + ఎలుక = చిట్టెలుక (ద్విరుక్తటకారాదేశ సంధి)

5.టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగును.
ఉదాహరణ: పేరు+ఉరము=పేరుటురము(టుగాగమ సంధి)
నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.(టుగాగమ సంధి)

6.రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే కర్మధారయమునందు రుగాగమంబగును.
ఉదాహరణ: పేద+ఆలు=పేదరాలు(రుగాగమ సంధి)

7.దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరమైతే దుగాగమంబు విభాషనగును.
ఉదాహరణ: నీ+చెలిమి = నీదు చెలిమి(దుగాగమ సంధి)

8.నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు,పరుష సరళంబులు పరమైతే నుగాగమంబగును.
ఉదాహరణ: సొగసు+తనము=సొగసుందనము(నుగాగమ సంధి)

9.త్రిక సంధి: ఆ ,ఈ ,ఏ అను సర్వనామంబులు పరమైతే త్రికసంధి అగును .

ఉదాహరణ: అక్కడ = ఆ+కడ; ఇక్కడ ‘ఆ’ అనునది .త్రికము యొక్క మరియు ‘క’ అనునది అసంయుక్త హల్లు కాబట్టి ద్విరుక్తంబు వచ్చి ఉన్నచో త్రికసంధి అందురు.
ఆ+క్కడ ఐనది.ద్విరుక్తంబగు ‘క్క’ పరమైనప్పుడు ‘ఆ’ దీర్ఘం కాస్త హ్రస్వంబై ‘అ’ అవుతుంది ఉదాహరణ : “అక్కడ”

10.ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరమైతే ‘మూడు’ శబ్దములోని ‘డు’ వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగును.
ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.(ద్విగు సమాస సంధి).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *