moral stories in telugu for students to write

moral telugu stories

moral stories in telugu for students to write:

కథ : ఐకమత్యం

moral stories in telugu for students to write:అనగనగా ఒక ఊరిలో వేటగాడు ఉండేవాడు.అతను అడవిలో వేటకు వెళ్తూ ఉండేవాడు.

వెళ్ళినప్పుడు ఏ జంతువు కానీ పక్షి కానీ చిక్కలేదు.రోజంతా తిరిగి తిరిగి అలసిపోయేవాడు.

సాయంత్రం అయ్యే సరికి ఇంటికి అలసిపోయి వచ్చేవాడు.అప్పుడు ఎం చేయాలో ఆలోచిస్తూ ఉండగా ఆ వేటగాడికి ఒక ఆలోచన వచ్చింది.

ఒక చెట్టు దగ్గ్గరలో సన్నటి వల వేస్తే దానిపైన విత్తనాలు చల్లి ఉంచితే పక్షులు విత్తనాలకు వచ్చి చిక్కుతాయని ఆశతో ఒకరోజు వేటకి బయల్దేరాడు.

ఒక చెట్టు దగ్గర్లో ఉన్నసన్నటి వల వేసి దానిపైన విధానాలను చల్లాడు.

తరువాత వాటిని దూరం నుంచి గమనించసాగాడు.ఇంతలో ఎగురుతున్న పక్షులు కొన్ని అటుగా వెళ్తున్న దారిలో విత్తనాలు గమనించాయి.

వెంటనే పక్షులు వచ్చి తింటూ ఉన్నాయి.గుంపుగా పక్షులన్నీ అక్కడికి చేరాయి.హాయిగా కింద పడిన విత్తనాలను తింటున్న పక్షులకి మెల్లగా తమ కాళ్ళకి చుట్టుకున్న వాలని గమనించాయి.

వలలో పక్షులన్నీ చిక్కుకోవడం చూసి ఆ వేటగాడు సంతోషించాడు.మరో వైపు పక్షులన్నీ భయంతో ఎగరడానికి ప్రయత్నిచాయి కానీ ఎగరలేకపోయాయి.

ఆ గుంపులో ఉన్న ఒక పక్షి ఇలా అంది.మనమందరం వేటగాడి వలలో చిక్కుకున్నాము ఇప్పుడు ఒక్కరం ఒంటరిగా ఎగరలేకపోతున్నాము.

ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే ఒకటే మార్గం మనమందరం ఒకేసారి ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చుని చెప్పింది.

అప్పుడు అన్ని పక్షులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని అనుకున్నట్టుగానే అన్ని పక్షులు ఒకేసారి ఎగురుతూ వలతో పాటు పక్షులన్నీ గాలితో పాటు ఎగిరిపోయాయి.

పక్షులన్నీ వాటి ప్రాణాలను రక్షించుకున్నాయి.అది చూసిన వేటగాడు పక్షుల ఐకామ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.ఇలా వేటగాడి బారి నుడి పక్షులన్నీ తప్పించుకున్నాయి.

నీతి : ఐకమత్యమే మహా బలం

2.కుక్క-నక్క

moral stories in telugu

అడవిలో ఒక నక్క ఒకటి ఉండేది.ఒకరోజు దారితప్పి ఊళ్లోకి వచ్చేసింది.ఆ ఊళ్ళో త్వ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క నక్కకు ఎదురు వచ్చింది.ఆ నక్క కుక్కని ఆశ్చర్యంగా చూస్తూ.”నీ మేడలో ఆ గొలుసు,ఆ బిళ్ళ ఏమిటి ?”అని అడిగింది.

కుక్క “ఓహ్ ! అదా!నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు.నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఈ ఊళ్ళో ఉన్న వీధికుక్కలతో పాటు పట్టుకునివెళ్ళకుండా ఉండడానికి ఈ బిళ్ళని నా మేడలో కట్టాడు.”అని కుక్క చెప్పింది.అప్పుడు ఆ నక్క ఆశ్చర్యంగా ఉందే అని అంది నక్క “నీవు అడవిలో ఉంటావు కాబట్టి ఇవన్నీ నీకు తెలియదులే” మా యజమాని చాలా మంచివాడు.నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు.నాకు కావాల్సిన మంచి ఆహరం,రొట్టెలు.పాలు,మాంసం,అన్ని పెడతాడు.రోజు వేడినీళ్ళతో స్నానం చేయిస్తాడు.అంతే కాదు పడుకోవడానికి కూడా మెత్తటి పరుపు కూడ ఉంది.అని గర్వంగా నక్కతో చెప్పింది.

“ఓహ్ అలాగా”అని నక్క జలసితో చూసింది.మల్లి కుక్క తన గొప్పలు చప్పుకుంటూ ఉంది.అంతే కాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి..మా జాతి వైరం లేకుండా ఆ పిల్లులతో సరదాగా ఆడుకుంటాను.అని చెప్పింది కుక్క.

నక్క “మిత్రమా ఈ రోజు నుండి మనం స్నేహితులం”నేను మీ ఊళ్లోకి వచ్చాను నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్తావా ” అని అడిగింది నక్క సరే అని కుక్క నక్కను తన యజమాని ఇంటికి తీసుకువెళ్ళింది.మా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు నన్ను కొడతాడని నక్కను ఆ ఇంటి పెరట్లో దాచి తన రొట్టెలు,మాంసం,నక్కకి రోజు పెట్టసాగింది.కుక్క చేసే మర్యాదలకు సంతోషించాల్సిందిపోయి..ఈర్ష్యతో నేను ఎండకు ఎండి,వానకు తడిస్తూ ఉంటె కుక్క మాత్రం ఇన్ని సౌకర్యాలతో ఇంత వైభోగంగా అనుభవిస్తుందా అని అసూయ పడింది.

ఇంతలో కుక్క వచ్చి “నీవొచి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో ” అని అంది.”మిత్రమా”ఇంకొకరోజు ఉండి నేనే వెళ్తాను అని కుక్కను అడిగింది. దానికి సరే అని కుక్క ఒప్పుకుంది మరుసటి రోజు అందరూ నిద్రపోతుండగా మెల్లగా ఇంట్లోకి చొరబడి పిల్లులను చంపి తిని ఎముకలను పడేసి వెళ్లిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటి నుంచి తరిమేశాడు నమ్మకంతో నక్కను తీసుకొచ్చి పెద్ద తప్పు చేసింది ఆ కుక్క.

నీతి : చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం,ఎవరిని తొందరగా నమ్మకూడదు.

Related links:

తెలివైన కాకి