carona virus || కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

coronavirus disease
Spread the love

carona virus: కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

carona virus: ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనల్ని ఎంతగానో వణికిస్తున్న ఈ మహమ్మారి “కరోనా “(covid -19) నుండి ఇప్పుడున్న నేపద్యంలో మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

రోజురోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతుంది..ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

కావున ఈ కరోనా గురించి తెలుసుకొని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుంటే కరోనాని అరికట్టే విధంగా మనం ముందు ఉంటాం.

corona virus

కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం.

ముందుగా కరోనా అంటే ఏమిటో తెలుసుకుంటే ఆ వైరస్ నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సులభంగా అర్దమవుతుంది.

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఈ కరోనా వైరస్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

కరోనా వైరస్ అంటే ఏమిటి ?

కరోనా అంటే లాటిన్ భాషలో “కిరీటం” అని అర్ధం. ఈ వైరస్ కి కరోనా పేరు ఎందుకు పెట్టారంటే. మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకారంలో ఉన్నది.కావున ఈ వైరస్ కి కరోనా అని పేరు పెట్టారు.

ఈ వైరస్ మాములుగా ఒకరికి వస్తే అది ఇంకొకరికి అంటుకుపోయే వైరస్..దీనికి ఇంకా ఎలాంటి మెడిసిన్ వైద్యులు కనిపెట్టలేదు.అందుకే కరోనా వైరస్ గురించి తెలుసుకొని జాగ్రత్త గా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కంటికి కనిపించని ఈ వైరస్ కి దూరంగా ఉండాలంటే మంచి జాగ్రత్తలు తప్పనిసరి.పిల్లలు, పెద్దలు ,గర్భిణీలు,వృద్ధులు…ఎలాంటి వారికైనా ఏ వైరస్ సోకుతుంది. కాబట్టి మీరు ఈ వైరస్ కి దూరంగా ఉండండి.

ఈ వైరస్ సోకినా వ్యక్తికి ఉండే లక్షణాలు:

ముందుగా జలుబు వస్తుంది, ఆ తరువాత జ్వరం,దగ్గు ,తలనొప్పి ఎక్కువగా ఉంటుంది.ఛాతిలో నొప్పితో బాధపడతారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. దీని వలన అనేక వ్యాధులకు దారి తీస్తుంది.

కావున ముందుగానే లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.ఎందుకంటే ఒకరికి ఈ వైరస్ సోకితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి కానీ,మరియు మీకు దగ్గర్లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియకుండానే ఈ వైరస్ సోకవచ్చు.

కాబట్టి వెంటనే ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ సంప్రదిస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమంది అనుమానం ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్న వాళ్లలో ఈ వైరస్ నుండి బయటపడ్డవాళ్లు కూడా ఉన్నారు.

ఈ వైరస్ గురించి తెలుసుకున్నాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

 

 1. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి మధ్య దూరాన్నిపాటించండి.
 2. ఎవరికైనా జలుబు దగ్గు ఉంటె వారికీ దూరంగా ఉండండి.వారిని మాస్క్ ధరించమని చెప్పండి.ఆలా చెప్పడం వలన మిగితా వాళ్ళకి రాకుండా ఉంటుంది.
  3. బయటికి వెళ్ళేటప్పుడు చేతికి గ్లౌసెస్,మాస్క్ ధరించండి.
  4. ఎలాంటి వస్తువులను తాకిన వాటికీ బ్యాక్టీరియా ఉంటే వాటిని తాకడం వలన మీరు కళ్ళను ముక్కును తాకినప్పుడు వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
  5. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోండి.సబ్బుతో కానీ లేదా శానిటైజర్స్ ,లేదా డెటాల్ లిక్విడ్స్ ని ఉపయోగించండి.

ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు కరోనా వైరస్ దూరంగా ఉండగలరు. కాబట్టి పాటించండి అందరికి తెలియజేయండి.

గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

corona virus on pregnant women

కరోనా వైరస్ గర్భిణీలకు ఈ వైరస్ వలన చాలా కీలకమైన వాతావరం ఉంది కాబట్టి, ఎక్కువగా గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భిణీలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్త పడాల్సి వస్తుంది.

 • ఎలాంటి ప్రభావం మీ మీద పడకుండా మీకు సంబంధించిన వరకు అందరికి దూరంగా ఉండడం చాలా మంచిది.ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో అందరికంటే ఎక్కువగా గర్భిణీలు జాగ్రత్త వహిస్తే ఆరోగ్యంగా ఉంటారు.
 • తినేటప్పుడు, మరియు ముఖాన్నితాకినప్పుడు చేతులని శానిటైజర్స్ తో కానీ,లిక్విడ్స్ తో కానీ శుభ్రం చేసుకొని తినండి.
 • ఎలాంటి ఫుడ్ తినాలనుకున్న ముందుగా వాటిని శుభ్రపరుచుకొని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి.
 • రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి నిమ్మరసాన్ని,కానీ బత్తాయి రసాన్ని కానీ తాగండి.మీకు జలుబు రాకుంటేనే తాగండి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 • డాక్టర్ చెప్పిన విధంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మంచి ఫుడ్ ని తీసుకోండి.

ఇప్పుడున్న పరిస్థితిల్లో ఎక్కువగా మీరు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు.

RELATED LINKS :

pregnant women exercise

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *