breast cancer symptoms in telugu || రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

Spread the love

breast cancer symptoms in telugu (రొమ్ము క్యాన్సర్ లక్షణాలు):

breast cancer symptoms in telugu : సాధారణంగా రొమ్ము క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటూనే ఉన్నాం.ఇప్పుడు ఈ వ్యాధి తో మరణాలు అనేవి చాల తగ్గాయి అందుకు గల కారణం ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడమే.కావున అందరికి రొమ్ము క్యాన్సర్ అనేది తెలుకోవడం చాల అవసరం.ఎందుకంటే రొమ్ముక్యాన్సర్ స్త్రీ పురుషులలో వస్తుంది.కానీ మహిళల్లో చాలా సాధారణం.కావున రొమ్ము క్యాన్సర్ గురించి తెలుకోవడం చాలా ముఖ్యం. రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి?రొమ్ముక్యాన్సర్ కి గల కారణాలు?రొమ్ము క్యాన్సర్ ఎలా నిర్దారించుకోవాలో తెలుకుంటే ఈ వ్యాధి నుండి బయట పడవచ్చు.

breast cancer

 

ప్రస్తుత కాలంలో ఈ రొమ్ముక్యాన్సర్ కి చికిత్స చేయడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నారు. కావున రొమ్ముక్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉందని అందరూ తెలుకోవాలి. ముందుగా ఈ రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది?ఎలా గుర్తించాలి? అనేది తెలుసుకుందాం.

రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి ?

రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ము కణాలలో ఏర్పడే గడ్డ రొమ్ము క్యాన్సర్ గా గుర్తించవచ్చు.రొమ్ము క్యాన్సర్ గుర్తించలేక చాలా మంది హానిపోవడం కూడా జరిగింది.ఈ వ్యాధి ముందుగా గుర్తిస్తే బయటపడవచ్చు.

ప్రస్తుత కాలంలో ఈ వ్యాధి కి చికిత్స ఉంది కాబట్టి ముందుగానే గుర్తించి డాక్టర్ ని సంప్రదించండి.

రొమ్ముక్యాన్సర్ లక్షణాలు:

symptoms of breast cancer in telugu

1.రొమ్ము చుట్టూ పక్కల కణజాలం నుండి బిన్నంగా గడ్డలా ఏర్పడితే ఆ గడ్డ గట్టిగా ఉంటే అది క్యాన్సర్ గడ్డగా గుర్తించవచ్చు.

2.రొమ్ము యొక్క ఆకారం మారుతుంది.

3.రొమ్ము చనుమొన రొమ్ము చుట్టూ చర్మం యొక్క వర్ణద్రవ్యం ఉన్న ప్రాంతంపై లోపలికి నొక్కుకుపోయినట్టుగా ఉండడం.

4.రొమ్ముల పైన చర్మం నారింజ రంగు లేదా ఎర్రగా మారితే రొమ్ము క్యాన్సర్ గా గుర్తించవచ్చు.

5.రొమ్ములో గడ్డ నొప్పి గా ఉండకపోవడం.

మహిళలు తరుచు అడిగే ప్రశ్న “రొమ్ము భాగంలో నొప్పి ఉంటే క్యాన్సర్ ఉన్నట్టేనా?

మహిళల్లో సాధారణముగా నెలసరి సమయంలో రొమ్ము భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది.నెలసరి సమయం అయిపోయాక ఆ నొప్పి తీవ్రత తగ్గుతూ ఉంటుంది.

కానీ ఆ నొప్పి తగ్గకపోతే రొమ్ము క్యాన్సర్ గా గుర్తించవచ్చు.

రొమ్ము క్యాన్సర్ కి కారణాలు :

రొమ్ము క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.మహిళల్లో ఎక్కువగా ఈ వ్యాధి రావడం చాలా సాధారణం.

ఈ వ్యాధి ఎలాంటి వారికీ వస్తుంది?అనేది తెలుసుకుందాం ..

 

  • రొమ్ము క్యాన్సర్ 30 నుంచి 70 సంవత్సరాలు వయసు ఉన్న వారికీ ఈ వ్యాధి వస్తుంది.అయితే ఎలాంటి వారికీ వస్తుంది అనేది ముక్యముగా తెలుకోవాలి.
  • రొమ్ము క్యాన్సర్ వాతావరణంలో ఉండే మార్పులే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రావడానికి గల కారణం ఉండవచ్చని భావిస్తున్నారు.తారలు మారుతున్న కొద్ది జన్యు పరమైన మార్పులు వస్తూ ఉంటాయి.మనం తినే ఆహారం కూడా ఒక కారణమే అని చెప్పవచ్చును.
  • వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ రావచ్చు.
  • జన్యు పరంగా ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.మీకు బాగా దగ్గరి బంధువులలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లయితే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.
  • రొమ్ము క్యాన్సర్ కి గురైతే.అది రెండో రొమ్ముకి సైతం వచ్చే అవకాశం ఉంది.అలాగే ముందుగానే గుర్తుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే.మల్లి వచ్చే ప్రమాదం ఉంది.ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ట్రీట్మెంట్ కి రెడీ గా ఉంటె తగ్గే అవకాశం ఉంది.
  • రేడియేషన్ ప్రభావం వలన కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.గతంలో ఎప్పుడైనా మీరు రేడియేషన్ చికిత్స తీసుకొని ఉంటే దానివలన కూడా మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
  • గర్భం దాల్చిన వారిలో మరియు ఆలస్యముగా సంతానం కలిగిన వారిలో ,30 యేళ్ళ తరువాత సంతానానికి జన్మనిచ్చిన వారిలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
  • అధిక బరువుతో ఉన్న వారిలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

మహిళలు ముందుగా రొమ్ము క్యాన్సర్ కి గల కారణాలు,మరియు వాటి లక్షణాలు ఇవన్నీ తెలుకొని ముందుగానే గుర్తుంచి డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధి నుండి బయటపడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *