telugu grammer in telugu || సంధులు-వ్యాకరణ పరి భాషలు

telugu grammer in telugu:

telugu grammer : సంధులు – వ్యాకరణ పరి భాషలు :
తెలుగు వ్యాకరణ పద్దతిలో సంధులను ఉపయోగించే వాటి పరిభాషతో కూడిన పదాలను తెలిజేయడం జరుగుతుంది.
1. సవర్ణదీర్ఘసంధి:
అ ,ఇ ,ఉ,ఋ లకు అచ్చులు పరమైతే దీర్ఘాలతో కూడిన ఏకవచనముతో తెలియజేసే వాటిని సవర్ణదీర్ఘసంధి అని అంటారు.
ఉదాహరణ: రామ+ఆజ్ఞ = రామాజ్ఞ (సవర్ణదీర్ఘసంధి )
గురు+ఉపదేశము = గురూపదేశము (సవర్ణదీర్ఘసంధి )
2.గుణసంధి: అకారానికి ఇ ,ఉ ,ఋ లు పరమైతే ఏ ,ఓ ఆర్ లు ఏకవచనముగా తెలియజేసేది గుణసంధి.
ఉదాహరణ: సూర్య + ఉదయము =సూర్యోదయము(గుణసంధి)
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు (గుణసంధి )
3.వృద్ధి సంధి: అకారానికి ఏ,ఐ లు పరమైతే ఔకారానికి ఋ ఋ లు పరమైతే ఆర్ ఏకవచనముతో పిలువబడేది వృద్ధిసంధి అంటారు.
ఉదాహరణ: భువన + ఏక =భువనైక (వృద్ధిసంది)
పరం+ఔషధం=పరమౌషధం (వృద్ధిసంధి)
అష్ట+ఐశ్వర్యములు =అష్టైశ్వర్యములు (వృద్ధిసంధి)
4.అనునాసిక సంధి: క , చ , ట ,త , ప లకు ‘న – మ ‘ అను అనునాసికా అక్షరములు పరమైతే క్రమముగా ఆయా వర్గ అక్షరములు అనునాసికా సంధి అగును.
ఉదాహరణ: జగత్+నాటకము=జగన్నాటకము.(అనునాసికా సంధి )

5.జస్త్వ సంధి: ఆయా వర్గ ప్రథమ అక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, పరమైతే క్రమముగా ఆయా వర్గ తృతీయ అక్షరములు అగును.
ఉదాహరణ: వాక్+ఈశ=వాగీశ.(జస్త్వ సంధి)

6.శ్చుత్వ సంధి: ఆయా సకారత వర్గములకు, శకార చవర్గములు పరమైతే శకార చవర్గములు ఆదేశమగును.
ఉదాహరణ: తపస్+శక్తి=తపశ్శక్తి(శ్చుత్వ సంధి).

7.ష్టుత్వ సంధి: ష్టుత్వ సంధి అనగా, సకార తవర్గములకు “షకార- టవర్గములు” పరమైతే, ఆయా షకార-టార్గములు అందురు.
ఉదాహరణ: తత్+టీక=తట్టీక(ష్టుత్వ సంధి).

8.ఛత్వ సంధి: క – చ – ట – త – ప లకు ‘శ’ అనే వర్ణము పరమైది ‘ఛ’ కారము వచ్చును.
ఉదాహరణ: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి(ఛత్వ సంధి).

అచ్చు సంధులు:

1.అకార సంధి: అత్తునకు సంధి బహుళముగా వచ్చినచో,

ఉదాహరణ: మేన+అల్లుడు=మేనల్లుడు(అకార సంధి)

2.యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరమైతే స్వరంబునకు యడాగమంబగు.
ఉదాహరణ: వెల+ఆలు=వెలయాలు.(యడాగమ సంధి )

3.ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు వున్నచో ఇకారసంధి అగును.
ఉదాహరణ: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు(ఇకారసంధి)

4.ఉకార సంధి: ఉత్తునకు సంధి నిత్యం ఉన్నచో,
ఉదాహరణ: మనము+ఉంటిమి = మనముంటిమి.(ఉకార సంధి)
రాముడు +అతడు = రాముడతడు (ఉకార సంధి)
ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరమైతే సంధి తరచుగానగు వచ్చినచో ఆమ్రేడిత సంధి అగును.
ఉదాహరణ: ఏమి+ఏమి=ఏమేమి.(ఆమ్రేడిత సంధి)
చివర + చివర= చిట్టచివర.(ఆమ్రేడిత సంధి)
కడ + కడ = కట్టకడ(ఆమ్రేడిత సంధి)

హల్లు సంధులు :

1.గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ,స,డ,ద,వలు బహుళముగ వచ్చినచో గసడదవాదేశ సంధి అగును.
ఉదాహరణ: వాడు+కొట్టె=వాడుగొట్టె(గసడదవాదేశ సంధి)
2.సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు పరమైతే సరళములగు
ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెనుగలువలు(సరళాదేశ సంధి)

3.పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పరమైతే
పుంప్వాదేశ సంధి అగును.
ఉదాహరణ: సరసము+మాట = సరసపుమాట(పుంప్వాదేశ సంధి)
ముత్యము+చిప్ప=ముత్యపుచిప్ప(పుంప్వాదేశ సంధి)
4.ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు,చిఱు,కడు,నడు,నిడు శబ్దముల ‘ఱ-డ’ లకు అచ్చు పరమైతే ద్విరుక్త టకారంబగును.
ఉదాహరణ: నడు+ఇల్లు=నట్టిల్లు(ద్విరుక్తటకారాదేశ సంధి)
చిఱు + ఎలుక = చిట్టెలుక (ద్విరుక్తటకారాదేశ సంధి)

5.టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగును.
ఉదాహరణ: పేరు+ఉరము=పేరుటురము(టుగాగమ సంధి)
నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.(టుగాగమ సంధి)

6.రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే కర్మధారయమునందు రుగాగమంబగును.
ఉదాహరణ: పేద+ఆలు=పేదరాలు(రుగాగమ సంధి)

7.దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరమైతే దుగాగమంబు విభాషనగును.
ఉదాహరణ: నీ+చెలిమి = నీదు చెలిమి(దుగాగమ సంధి)

8.నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు,పరుష సరళంబులు పరమైతే నుగాగమంబగును.
ఉదాహరణ: సొగసు+తనము=సొగసుందనము(నుగాగమ సంధి)

9.త్రిక సంధి: ఆ ,ఈ ,ఏ అను సర్వనామంబులు పరమైతే త్రికసంధి అగును .

ఉదాహరణ: అక్కడ = ఆ+కడ; ఇక్కడ ‘ఆ’ అనునది .త్రికము యొక్క మరియు ‘క’ అనునది అసంయుక్త హల్లు కాబట్టి ద్విరుక్తంబు వచ్చి ఉన్నచో త్రికసంధి అందురు.
ఆ+క్కడ ఐనది.ద్విరుక్తంబగు ‘క్క’ పరమైనప్పుడు ‘ఆ’ దీర్ఘం కాస్త హ్రస్వంబై ‘అ’ అవుతుంది ఉదాహరణ : “అక్కడ”

10.ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరమైతే ‘మూడు’ శబ్దములోని ‘డు’ వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగును.
ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.(ద్విగు సమాస సంధి).

telugu grammer || తెలుగు వ్యాకరణము

telugu grammer (తెలుగు వ్యాకరణము) :

telugu grammer:తెలుగు వ్యాకరణము,తెలుగు భాషను అక్షరాలలో మరియు పదాలతో కూడిన నియమాలను తెలుగు వ్యాకరణము అంటారు.తెలుగు బాషా లక్షణాలను సందులు,సమాసాలు,అలంకారాలు ఛందస్సు,తదితరాలను రాసిన గ్రంధమే ఈ వ్యాకరణం.ఎంతో శుభమైన పద్ధతిలో ఈ వ్యాకరణలను అర్థంచేసుకునేలా రూపొందించడం జరిగింది.ప్రతి భాషకి నిర్దిష్ట నియమాలు ఉన్నట్టే ఈ తెలుగులో కూడా నిమాలతో కూడిన వ్యాకరణలు ఉన్నాయి.

తెలుగు పదాలు :

తెలుగు బాషా భాగంలో పదాలు అనే ఐదు భాగాలను విభజించారు.అవి :
1. నామవాచకం
2. సర్వనామం
3. విశేషణములు
4. అవ్యయములు
5. క్రియలు

1.నామవాచకం : నామవాచకం ప్రత్యేకంగా “పేరుతో” పిలువబడే ప్రతి పదముని నామవాచకం అని అంటారు.ఉదాహరణ:మానవుల యొక్క పేర్లు,జంతువుల యొక్క పేర్లు,ప్రదేశములు,వస్తువుల పేర్లు తో ఉపయోగించి పిలువబడే పదాలను నామవాచకము అని అంటారు.ఉదాహరణ: పాఠశాల,గోదావరి,రాముడు,సీత మొదలగునవి.

2.సర్వనామము: నామవాచకమునకు బదులుగా అనగా “పేరు” తో కాకుండా దాని బదులుగా పిలుబడే పదాలను సర్వనామము అని అంటారు.ఉదాహరణ : నీవు,అతడు,ఆమె మొదలగునవి.

3.విశేషణములు: నామవాచకము,సర్వనామముల యొక్క గుణములను తెలిపే పదాలను విశేషణములు అని అంటారు.ఉదాహరణ : పొడవైన,ఎరుపు,తీపి.

4.అవ్యయములు: లింగ,వచన,విభక్తులచేత మార్పులేని పదాలుగా వాడబడే పదములను అవ్యములు అని అంటారు.ఉదాహరణ : ఆహ!ఓహో!అలాగా!మొదలగునవి.

5.క్రియలు: పనులను మాత్రమే తెలియజేసే పదాలను క్రియలు అంటారు.ఉదాహరణ : చదువుట,రాయుట,ఆడుట,మొదలగునవి.

తెలుగు వాక్యాలు :

తెలుగు వ్యాకరణ పద్దతిలో కర్త,కర్మ,క్రియలను ఉపయోగించి ఈ మూడు అంశాలతో కూడిన భాగములను తెలుగు వాక్యాలు అంటారు.
1.కర్త: ఒక పని చేసే వారిని “కర్త” అని అంటారు.
2.కర్మ: ఆ పని యొక్క ఫలితం ను అనుభవించేవారిని “కర్మ” గా చెప్పవచ్చు
3.క్రియ: పనిని తెలియజేసే పద్దతిని “క్రియ” అని అంటారు.

తెలుగు వచనములు :

ప్రతి భాషకి వచనములు నిర్దిష్ట పద్దతిలో ఉంటాయి.అలాగే ఈ తెలుగు బాషకిలో రెండు వచనములు ఉన్నాయి.అవి :
ఏకవచనము
బహువచనం

1.ఏకవచనం: ఏకవచనం అనగా ఒక వస్తువు గాని,వ్యక్తిని గాని,పిలువబడే పద్ధతిని ని ఏకవచనం అని అంటారు.ఉదాహరణ: రాముడు,వనము,సీత,మొదలగునవి.

2.బహువచనం: రెండుగాని అంతకంటే ఎక్కువగాని పిలువబడే పద్దతిని బహువచనం అంటారు.ఉదాహరణ: వస్తువుల గురించిగాని,మనుషులగురించి గాని ,పిలిచే వచనములను బహువచనములు అందురు.ఉదాహరణ:పాలు,పెసర్లు,కందులు,స్నేహితులు మొదలగునవి.

 

Related links

తెలుగు అక్షరాలు :

 

alphabets in telugu || తెలుగు అక్షరమాల

alphabets in telugu

alphabets in telugu : తెలుగు అక్షరమాల : 

alphabets in telugu:మనకు ఆంగ్ల అక్షరాలలో అచ్చులు మరియు హల్లులు ఉన్నందున,తెలుగులో కూడా మనకు అచ్చులు మరియు హల్లులు ఉన్నాయి.గతంలో కొన్ని అక్షరాలు వాడుకలో ఉన్నాయి, కాని తరువాత వాటి వాడకం పూర్తిగా ఆగిపోయిది.ప్రస్తుతం – 14అచ్చులు,36 హల్లులు.ఉభయ అక్షరాలు.తెలుగు లో పూర్తిగా ఒత్తులను పలకడానికి అనువైన పద్దతితో ఉపయోగించే ప్రతి అక్షరం ముఖ్యమైనది.

అచ్చులు :

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

హల్లులు :

క  ఖ  గ  ఘ  ఙ
చ  ఛ  జ ఝ ఞ
ట  ఠ  డ  ఢ  ణ
త  థ  ద  ధ  న
ప  పా బ  భ  మ
య ర  ల  వ  శ
ష  స  హ ళ  క్ష ఱ

ఉభయ అక్షరాలు :

సున్నా ( అం ), అరసున్న( ఁ ), విసర్గ ( అః )..

Relted links :

telugu rymes

nursery telugu rhymes || బుజ్జి బుజ్జి పాటలు

telugu nursery rhymes

nursery telugu rhymes:

nursery telugu rhymes : చిన్నపిల్లకి ఆడుతూ పడుతూ వాళ్లకు చెపుతుంటే పిల్లలకి ఉత్సాహం తో ఎంతో ఆనందంగా ఉంటారు.అలాంటి పిల్లకు బుజ్జి బుజ్జి పాటలు మీకోసం.

1.”ఉడతా ఉడతా ఉఛ్”

2.”చల్ చల్ గుర్రం”

3.”కాకి కాకి”

4.”ఛుక్ ఛుక్ రైలు”

5.”మా ఇంటి కుక్కపిల్ల”

Related links:

telugu rhymes:

 

children’s rhymes || చిన్న పిల్లల పాటలు

telugu videos rhymes

children’s rhymes:

children’s rhymes : చిన్నపిల్లకి బుజ్జగిస్తూ ఆడుతూ పడుతూ పిల్లకి ఆనందాన్ని పంచిపెడతారు బుజ్జి బుజ్జి మాటలతో ,మంచి మంచి పాటలతో ఎన్నెన్నో చెపుతూ ఉంటారు.

1.”జానీ జానీ” తెలుగు రైమ్

2. “చందమామ రావే” 

3.”చెమ్మచెక్క”

4.”వాన వాన వల్లప్పా”

5.” పొద్దునే మనము లేవాలి “

Related links:

more rhymes 

rhymes in telugu || పిల్లల పాటలు,ఆటలు

telugu baby rymes

rhymes in telugu:

rhymes in telugu : పిల్లకి ఆటలు పాటలు అంటే చాల ఇష్టంగా ఉంటాయి. పిల్లకి సమయం దొరికిందంటే ఆటలు ఆడుతూ పడుతూ ఉత్సహంగా ఉంటారు.

పిల్లని చూసి పెద్దలకి ఉత్సాహం వస్తుంది అందుకే అలాంటి పాటలు,ఆటలు మీకోసం.

1.”దాగుడు మూతలు దండ కోల్”

పిల్లల కోసం ఈ సరదా సరదాగా రైమ్స్ తెలుగులో”దాగుడు మూతలు దండ కోల్ ” రైమ్స్ ప్రతి పిల్లకి ఎంతో ఇష్టమైన ఆట.ప్రతి పిల్లలు ఆడు కోవడానికి దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు.పిల్లలు కాళీ సమయములో ఇలాంటివి ఆడుతూ ఉంటారు.

2.“పిల్లవాడి కోణం నుండి రైలు ప్రయాణం గురించి”

పిల్లలకి ఎంతో ఇష్టమైన తెలుగు రైమ్స్ “పిల్లవాడి కోణం నుండి రైలు ప్రయాణం గురించి” రైలు ప్రయాణం నిజంగా అద్భుతమైన ఆనందకరమైన సందర్భం.ఇలాంటి రైమ్ పిల్లలకి ఇంకా ఈ రైలులో ప్రయాణం చేసే వ్యక్తులకి ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి.

3.”చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా”

4.నర్స్-పిల్లలు

5.”బుజ్జి మేక మేక”

related links :

moral stories in telugu for students to write

moral telugu stories

moral stories in telugu for students to write:

కథ : ఐకమత్యం

moral stories in telugu for students to write:అనగనగా ఒక ఊరిలో వేటగాడు ఉండేవాడు.అతను అడవిలో వేటకు వెళ్తూ ఉండేవాడు.

వెళ్ళినప్పుడు ఏ జంతువు కానీ పక్షి కానీ చిక్కలేదు.రోజంతా తిరిగి తిరిగి అలసిపోయేవాడు.

సాయంత్రం అయ్యే సరికి ఇంటికి అలసిపోయి వచ్చేవాడు.అప్పుడు ఎం చేయాలో ఆలోచిస్తూ ఉండగా ఆ వేటగాడికి ఒక ఆలోచన వచ్చింది.

ఒక చెట్టు దగ్గ్గరలో సన్నటి వల వేస్తే దానిపైన విత్తనాలు చల్లి ఉంచితే పక్షులు విత్తనాలకు వచ్చి చిక్కుతాయని ఆశతో ఒకరోజు వేటకి బయల్దేరాడు.

ఒక చెట్టు దగ్గర్లో ఉన్నసన్నటి వల వేసి దానిపైన విధానాలను చల్లాడు.

తరువాత వాటిని దూరం నుంచి గమనించసాగాడు.ఇంతలో ఎగురుతున్న పక్షులు కొన్ని అటుగా వెళ్తున్న దారిలో విత్తనాలు గమనించాయి.

వెంటనే పక్షులు వచ్చి తింటూ ఉన్నాయి.గుంపుగా పక్షులన్నీ అక్కడికి చేరాయి.హాయిగా కింద పడిన విత్తనాలను తింటున్న పక్షులకి మెల్లగా తమ కాళ్ళకి చుట్టుకున్న వాలని గమనించాయి.

వలలో పక్షులన్నీ చిక్కుకోవడం చూసి ఆ వేటగాడు సంతోషించాడు.మరో వైపు పక్షులన్నీ భయంతో ఎగరడానికి ప్రయత్నిచాయి కానీ ఎగరలేకపోయాయి.

ఆ గుంపులో ఉన్న ఒక పక్షి ఇలా అంది.మనమందరం వేటగాడి వలలో చిక్కుకున్నాము ఇప్పుడు ఒక్కరం ఒంటరిగా ఎగరలేకపోతున్నాము.

ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే ఒకటే మార్గం మనమందరం ఒకేసారి ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చుని చెప్పింది.

అప్పుడు అన్ని పక్షులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని అనుకున్నట్టుగానే అన్ని పక్షులు ఒకేసారి ఎగురుతూ వలతో పాటు పక్షులన్నీ గాలితో పాటు ఎగిరిపోయాయి.

పక్షులన్నీ వాటి ప్రాణాలను రక్షించుకున్నాయి.అది చూసిన వేటగాడు పక్షుల ఐకామ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.ఇలా వేటగాడి బారి నుడి పక్షులన్నీ తప్పించుకున్నాయి.

నీతి : ఐకమత్యమే మహా బలం

2.కుక్క-నక్క

moral stories in telugu

అడవిలో ఒక నక్క ఒకటి ఉండేది.ఒకరోజు దారితప్పి ఊళ్లోకి వచ్చేసింది.ఆ ఊళ్ళో త్వ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క నక్కకు ఎదురు వచ్చింది.ఆ నక్క కుక్కని ఆశ్చర్యంగా చూస్తూ.”నీ మేడలో ఆ గొలుసు,ఆ బిళ్ళ ఏమిటి ?”అని అడిగింది.

కుక్క “ఓహ్ ! అదా!నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు.నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఈ ఊళ్ళో ఉన్న వీధికుక్కలతో పాటు పట్టుకునివెళ్ళకుండా ఉండడానికి ఈ బిళ్ళని నా మేడలో కట్టాడు.”అని కుక్క చెప్పింది.అప్పుడు ఆ నక్క ఆశ్చర్యంగా ఉందే అని అంది నక్క “నీవు అడవిలో ఉంటావు కాబట్టి ఇవన్నీ నీకు తెలియదులే” మా యజమాని చాలా మంచివాడు.నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు.నాకు కావాల్సిన మంచి ఆహరం,రొట్టెలు.పాలు,మాంసం,అన్ని పెడతాడు.రోజు వేడినీళ్ళతో స్నానం చేయిస్తాడు.అంతే కాదు పడుకోవడానికి కూడా మెత్తటి పరుపు కూడ ఉంది.అని గర్వంగా నక్కతో చెప్పింది.

“ఓహ్ అలాగా”అని నక్క జలసితో చూసింది.మల్లి కుక్క తన గొప్పలు చప్పుకుంటూ ఉంది.అంతే కాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి..మా జాతి వైరం లేకుండా ఆ పిల్లులతో సరదాగా ఆడుకుంటాను.అని చెప్పింది కుక్క.

నక్క “మిత్రమా ఈ రోజు నుండి మనం స్నేహితులం”నేను మీ ఊళ్లోకి వచ్చాను నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్తావా ” అని అడిగింది నక్క సరే అని కుక్క నక్కను తన యజమాని ఇంటికి తీసుకువెళ్ళింది.మా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు నన్ను కొడతాడని నక్కను ఆ ఇంటి పెరట్లో దాచి తన రొట్టెలు,మాంసం,నక్కకి రోజు పెట్టసాగింది.కుక్క చేసే మర్యాదలకు సంతోషించాల్సిందిపోయి..ఈర్ష్యతో నేను ఎండకు ఎండి,వానకు తడిస్తూ ఉంటె కుక్క మాత్రం ఇన్ని సౌకర్యాలతో ఇంత వైభోగంగా అనుభవిస్తుందా అని అసూయ పడింది.

ఇంతలో కుక్క వచ్చి “నీవొచి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో ” అని అంది.”మిత్రమా”ఇంకొకరోజు ఉండి నేనే వెళ్తాను అని కుక్కను అడిగింది. దానికి సరే అని కుక్క ఒప్పుకుంది మరుసటి రోజు అందరూ నిద్రపోతుండగా మెల్లగా ఇంట్లోకి చొరబడి పిల్లులను చంపి తిని ఎముకలను పడేసి వెళ్లిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటి నుంచి తరిమేశాడు నమ్మకంతో నక్కను తీసుకొచ్చి పెద్ద తప్పు చేసింది ఆ కుక్క.

నీతి : చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం,ఎవరిని తొందరగా నమ్మకూడదు.

Related links:

తెలివైన కాకి 

moral stories telugu to write

telugu kids stories

moral stories telugu to write:కుందేలు మరియు తాబేలు కథ

 

moral stories telugu to write : అనగనగా ఒక అడవి.ఆ అడవిలో ఒక కుందేలు మరియు తాబేలు ఉండేవి.వారిద్దరూ ఆడుకుంటూ కాలక్షేపం చేతు ఉండేవి.ఒక రోజు వారిద్దరు ఆడుతూ కుందేలు తాబేలుని ఎక్కిరించింది.

“నువ్వు ఇంత నిదానంగా నడుస్తున్నావు.ఇలా నడిస్తే ఎంతదూరం పోలేవు.నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లగలవా?నాతో నువ్వు పరుగు పందెం వేసుకుంటే నువ్వు సులువుగా ఓడిపోతావు!కుందేలు నవ్వుతూ ఎగతాళి చేసింది.

అప్పుడు తాబేలు నేను నీలాగా పరుగెత్తకపోవచ్చు.నేను నీతో పందెం వేసుకుంటే గెలుస్తాను.అని ధైర్యంగా నమ్మకంతో చెప్పింది.అది విన్న కుందేలు అయితే నాతో పందెం కాస్తవా? అని అడిగింది.దానికి తాబేలు పందానికి ఒప్పుకుంది.

ఆ పరుగు పందెం నిర్ణియించిన రోజు ఆ కుందేలు,తాబేలు పోటీ చూడటానికి అడవిలో ఉన్న జంతువులన్నీ పందెం జరిగే చోటుకి వచ్చాయి.కుందేలు పరుగు పందెంలో గెలుస్తానని గర్వంగా పోటీకి వచ్చింది.తాబేలు కూడా తన స్థానంలో నిలుచుంది.

వారి అడవిలో కోతిని పతాక కర్తగా ఎంచుకున్నారు.పందెం మొదలైంది.మొదలుపెట్టగానే కుందేలు తుర్రున పెరుగుడుతూ వెళ్ళింది.

తాబేలు కూడా మెల్లగా వెళ్తూ వుంది.కుందేలు సగం దూరం రాణే వచ్చింది కానీ తాబేలు కొంచం దూరం మాత్రమే వచ్చింది.కుందేలు సగం దూరంలో ఉంది అని ఆగి వెనక్కి చూసింది.

తాబేలు అవుపించలేదు.పాపం తాబేలు నాలాగా పరుగెత్తలేదు కదా!ఎక్కడో ధురాన ఉన్నట్టుంది అని అనుకోని తాబేలు రావడానికి చాల సమయం పడుతుంది.అంతవరకు నేను చెట్టు విశ్రాంతి తీసుకుంటాను అని ఒక చెట్టు నీడన కుందేలు పడుకుంది.

ఇంతలో తాబేలు వచ్చింది.మెల్లగా మెల్లగా ముగింపు గీత దగ్గరికి వచ్చేసింది.ఆ సమయంలో కుందేలుకు మెలుకవ వచ్చింది.తాబేలు గీత దాకా రావడం చూసి కుందేలు వేగంగా పరుగెత్తింది.

కానీ కుందేలు చేరే లోపే తాబేలు గీత దాటేసింది పోటీలో తాబేలు గెలిచింది.చుట్టూ ఉన్న జంతువులంతా తాబేలుని మెచ్చుకుని పొగడ్తలతో అభినదించారు.

నీతి : ఇతరులను ఎప్పుడు ఎగతాళి చేయకూడదు.ఎవరిని తక్కువగా చూడకూడదు.

Related links:

సింహం మరియు ఎలుక కథ

telugu children stories || రెండు పిల్లులు ఒక కోతి కథ

telugu childrens stories

telugu children stories:

రెండు పిల్లులు ఒక కోతి కథ:

telugu children stories : అనగనగా రెండు పిల్లులు ఉన్నాయి.వాటికీ ఒక రొట్టె ముక్క దొరికింది ఆ రొట్టె ముక్కని రెండు పిల్లులు దానికోసం నాదంటే నది అని గొడవపడుతూ ఉన్నాయి.గొడవపడుతూ ఉండడం ఒక కోతి చూసింది.

ఎంతసేపటికి ఆ పిల్లులు గొడవ తీరట్లే.వాటికీ ఎలా పరిష్కరించుకోవాలో అర్థంకావట్లేదు.ఆ పిల్లుల దగ్గరికి కోతి వెళ్లి మొత్తానికి వాళ్ళని విడదీసి ఎందుకు దెబ్బలాడుతున్నారు?మీ సమస్యకి ఒకటే పరిష్కారం.

ఈ రొట్టె ముక్కని మీరిద్దరూ చేరి సగం పంచుకోండి.మీ సమస్య తీరిపోతుంది.కావాలంటే మీకు నేను ఈ రొట్టె ముక్కని చేరి సగం పంచిపెడతాను అని వాళ్ళిద్దరికీ సలహా ఇచ్చింది.కోతి మాట విన్న ఆ పిల్లులు ఆ రొట్టె ముక్కని కోతికి ఇచ్చారు.

కోతి ఆ రొట్టె ముక్కను రెండుగా చేసింది.”అయ్యో ఒక రొట్టె ముక్క పెద్దగా ఉంది అని ఇంకో రొట్టె ముక్క చిన్నగా ఉంది అని!ఎలా అని పెద్దగా ఉన్న రొట్టెముక్కని కొంచం కొరికి తినేస్తే రెండు సమానం అవుతాయని రొట్టెముక్కని కొంచం కొరికి తినేసింది.

“అరెరే !ఇంకో రొట్టె ముక్క పెద్దగా అవుతుందని ఆ రొట్టె ముక్కని కొంచం కొరికి తినేసింది.ఛ!ఇప్పుడు ఇది పెద్దగా ఉంది అని మొదటి ముక్కని కొరికి తేనేసింది.ఇలా కొంచం కొంచం అంటూ రెండు రొట్టెముక్కలు అయిపోయేంతవరకు తినేసి తుర్రున చెట్టెక్కి పడుకుంది.

పిల్లులు కోతిని చూసి ఎం చేస్తుందో తెలియిక చూస్తూ ఉండిపోయాయి.రొట్టె ముక్క పిల్లులకు దక్కలేదు నిరాశగా వాటి దారిన అవి వెళ్లిపోయాయి.

నీతి : ఇద్దరు గొడవపడితే మూడో వాడికి సందు అవుతుంది. ఎప్పుడు కానీ మూడో వాడికి అవకాశం ఇవ్వకూడదు.

related links :

కుందేలు తాబేలు కథ

story with moral in telugu || moral stories for kids in telugu

moral stories in telugu write with moral

story with moral in telugu:

1.కుక్క- బావి కథ :

story with moral in telugu : అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్కకి ఆరుగురు బుజ్జి కుక్క పిల్లలు పుట్టాయి.

ఆ ఆరుగురు కుక్క పిల్లలకు మంచి బుద్దులు నేర్పిస్తూ,పిల్లలని క్షేమంగా కాపాడుకుంటూ వాటితో కాలక్షేపంచేస్తూ ఉండేది.

ఒక రోజు తన పిల్లలతో ఊరిలో తిరుగుతుండగా వాటికీ ఒక బావి కనిపించింది.

ఆ బావిని తన పిల్లలకి చూపించి ఆ బావి దగ్గరికి వెళ్ళకూడదు.అక్కడికి వెళ్తే చాల ప్రమాదం.అని పిల్లలకి చెప్పింది.

ఒక రోజు కుక్కపిల్లలు ఆడుతూ ఆడుతూ బావి ఉన్న చోటుకి వచ్చాయి.వాటిలో ఒక బుజ్జి కుక్కపిల్ల ఆ బావిని చూసి ఈ బావి దగ్గరికి వెళ్లోద్దని అమ్మ చెప్పింది”ఎందుకు ఆలా చెప్పింది?”ఇదేమిటో చూడాలి అని ఆ కుక్కపిల్ల అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది.

బావిలో తన ప్రతిబింబం అవపడింది.బావిలో ఉన్న ప్రతిబింబం ని చూసి నిజంగా నాలాగే ఇంకో కుక్క పిల్ల ఉదని గ్రహించి దాని మీద అరవడం మొదలుపెట్టింది.

ఆ ప్రతిబింబం తనలాగే అరవడం చూసి దానితో పోట్లాడడానికి ఆ కుక్కపిల్ల బావిలోకి దూకింది.ఆ బావి నీళ్లలో కొట్టుకుంటూ రక్షించండి అని పెద్దగా అరుస్తూ ఉంది.

ఇంతలో ఆ దారిలో వెళ్తున్న ఒక రైతు కి కుక్క పిల్ల అరుపులు వినిపించాయి.ఆ రైతు బావి దగ్గరికి వచ్చి చూసాడు.ఆ బావిలో కుక్క పిల్ల ని చూసి దాన్ని బయటికి తీసి రక్షించాడు .
నీతి : పెద్దలు చెప్పిన మాటలు వినాలి,పెద్దలు ఎప్పుడు మన మంచే కోరుతారు అని గ్రహించాలి.

2.రాము-చిలుక 

telugu stories for kids

రాము అనే ఒక అబ్బాయి.అతనికి పక్షులంటే ఇష్టం.అతనికి పక్షులు ఇస్తామని వాళ్ళ నాన్నగారు రాము పుట్టినరోజున ఒక చిలుకను కనుకగా రాము కి ఇచ్చాడు.రాము చిలుకని చూసి ఎంతో ఆనందించాడు.చిలకను పంజరంలో పెట్టి ప్రతిరోజు బడి నుండి రాగానే చిలుకతో ఆడుకునేవాడు.

రాము ఆ చిలుకకి ప్రతిరోజు జామ,అరటి,మామిడి,పళ్ళను తెచ్చిపెట్టేవాడు.చిలుక ఎప్పుడు అవి తినకుండా పక్కన అలాగే ఉంచేది.చిలుకకు పళ్ళు అంటే ఇష్టం ఉంటది కదా! కానీ నేను పెట్టిన పళ్ళు ఇందుకై తినడం లేదు,ఎందుకు నచ్చట్లేవు అని రాము ఆలోచిస్తూ చింతించేవాడు.

రాము ఒక రోజు పొద్దున్నే బడికి బడికి వెళ్ళాడు.సాయంత్రం అయ్యేసరికి రాము ఇంటికి రాలేదు.బడి అయిపోయాక సాయంత్రం ఇంటికి వచ్చే రాము ఆ రోజు రాలేదు.దన్తో రాము వాళ్ళ అమ్మానాన్న అతడి బడికి వెళ్లారు.ఇంతలో ఆ సమయానికి బడి వాచ్ మాన్ మాత్రమే ఉన్నాడు.వాచ్మాన్ తో రాము వాళ్ళ అమ్మానాన్నా విషయం మొత్తం చెప్పి రాము తరగతి గదికి వాళ్ళ ని వాచ్ మాన్ తీసుకెళ్లాడు.గది లోపల ఏదో శబ్దహాలు వినిపించాయి వాచ్ మాన్ తలుపు తీసేసరికి బోరున ఏడుస్తూ బయటికి వచ్చి బ్యాగ్ లో ఒక పుస్తకం కనిపించలేదు,బెంచీల కింద పడిపోయిఉంటుందని వెతకడానికి వెళ్ళాను ఇంతలో వాచ్ మాన్ తలుపులు వేసుకొని వెళ్ళిపోయాడు.నేను ఆ తరగతి గదిలోనే ఉన్నాను అని వాళ్ళ నాన్నతో చెప్పాడు.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన రాము అమ్మానాన్నా,స్నేహితులు లేకుండా గదిలో బందీగా ఉన్నాను.అది ఎంతో కష్టం అని అర్థంచేసుకున్న రాము పంజరంలో ఉన్న రామచిలికాని విడిచిపెట్టాడు.అప్పటినుంచి “పక్షులను బంధించకూడదు”అంటూ స్నేహితులందరికీ చెప్పసాగాడు.

Related links:

రెండు పిల్లులు ఒక కోతి కథ 

1 2 3 10